Bus Driver : కర్నూలు రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవర్ అరెస్ట్

bus driver

BUS Driver  :  కర్నూలు జిల్లా సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది సజీవ దహనానికి కారణమైన ఘటనకు సంబంధించి పోలీసులు బస్సు డ్రైవర్‌ మిరియాల లక్ష్మయ్యతో పాటు, కో-డ్రైవర్ (క్లీనర్) శివనారాయణ, ట్రావెల్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన డ్రైవర్ లక్ష్మయ్య.. 5వ తరగతి వరకే చదువుకొని నకిలీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్‌తో హెవీ లైసెన్స్ పొందినట్లుగా తెలుస్తోంది. నమోదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గొళ్ళ రమేష్ కుటుంబాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

అదే విధంగా, ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ కూడా రూ. 3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి, ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వం నుండి అందాల్సిన ఎక్స్ గ్రేషియా సాయం త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.