Tommy : కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. కర్నూలు శివారు ప్రాంతం, చిన్న టేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వీ-కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19మంది సజీవ దహనం అయ్యారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా తమవారిని చివరి చూపు చూసుకోకుండా డెడ్ బాడీలు దారుణంగా మిగిలిపోయాయి.
బస్సు బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. అయితే బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి, లీకైన పెట్రోల్‌కు బస్సు కింద ఘర్షణ వల్ల మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు క్షణాల్లోనే బస్సు అంతటా వ్యాపించాయి.
నిన్న బస్ ఫైర్ Accident కి కారణం అయిన వ్యక్తి.. మద్యం మత్తులో పెట్రోలు పంపు నుంచి వెళ్లిన cc footege.#kurnool #BusAccident pic.twitter.com/cUdZyx48yF
— kotlata (@kotlataweb) October 25, 2025
అయితే బస్ ప్రమాదానికి ఓ రకంగా కారణమైన బైకర్ శివశంకర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు శివశంకర్ తన ఫ్రెండ్ తో కలిసి ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. అక్కడ అతనితో పాటుగా మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు ఎర్రిస్వామి అలియాస్ టామీగా తేలింది. సరిగ్గా ప్రమాదానికి ముందు ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ తరువాత మాత్రం టామీ కనిపించకుండా పోయాడు. శివశంకర్ మాత్రమే ప్రమాదానికి గురై చనిపోయాడు.
ఎర్రిస్వామిది కర్నూలు సమీపంలోని ప్రజానగర్.. శివశంకర్‌కు స్వామి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎర్రిస్వామి ఫ్యామిలీ సెటిల్ అయింది. GHMCలో చెత్త సేకరించే పని చేస్తున్న స్వామి.. 6 నెలల తర్వాత సొంత ఊరుకు రావడంతో అతను శివశంకర్‌కు మద్యం తాగించి ఉంటాడని అనుమానం నెలకొంది. శుక్రవారం పెళ్లిచూపులు అనగా శివశంకర్ ఎందుకు బయటకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. స్వామి మాట్లాడితే చాల విషయాలు బయటకు వస్తాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శుక్రవారం తెల్లవారుజామున 2.24 గంటల వరకు బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్‌లో ఉన్నాడు. 2.39కి పెట్రోల్ బంక్‌ను బస్సు క్రాస్ చేసింది.
Also Read :
- Sisters : బాత్రూమ్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి..ఏం జరిగిందంటే?
- BIG BREAKING : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. స్పాట్ లో 36 మంది!
- Bus Accident : మద్యం మత్తులో బైకర్ శివశంకర్.. యాక్సిడెంట్‌కు 20 నిమిషాల ముందు హల్ చల్!
- Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు… తల్లికూతురు మృతి!
- Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సజీవదహనం
