BIG BREAKING : ఓఆర్‌ఆర్‌పై ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్ లో 20 మంది!

orr

BIG BREAKING : హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మరిచిపోకముందే పెద్దఅంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. పెద్దఅంబర్‌పేట ఎగ్జిట్ నెం.11వద్ద ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో 20మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం అంటేనే జనం వణికిపోతున్నారు.

నెల్లూరులోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరుమండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది ప్రయాణికులున్నారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.