BIG BREAKING : శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర టెంపుల్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమం ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు.
బిగ్ బ్రేకింగ్
శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట
9మంది మృతి, పలువురికి గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు#LatestNews #viral #ekadashi pic.twitter.com/jaTdPnoqA5
— Volga Times (@Volganews_) November 1, 2025
ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. రేయిలింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిన్న తిరుపతి పుణ్య క్షేత్రం ప్రాశస్య కలిగిన ఈ ఆలయానికి ఊహించని రీతిలో భక్తులు రావడంతో అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయారు. బందోబస్తు లోపమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులు ఆర్తనాదాలు పెడుతున్నారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఆలయం ఏడాది కిందట ప్రారంభించారు. 12 ఏకరాల్లో రూ. 10 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని పండా అనే ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి 2 వేల నుంచి 3 వేల వరకు భక్తులు మాత్రమే వచ్చేందుకు సౌకర్యం ఉంది. కానీ ఈ రోజున ఏకంగా 25 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. దీంతో సాధరణ స్థాయిలోని రెయిలింగ్ విరగడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.
