TG Crime : మీ తమ్ముడు పడిపోయాడని చెప్పి బాలికపై మైనర్లు అత్యాచారం!

TG Crime

TG Crime : ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు మైనర్లు, ఓ మేజర్ కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న బాలికను ఆపిన ఓ యువకుడు మీ తమ్ముడు కింద పడిపోయాడు. వెంటనే ఇంటి రా అంటూ చెప్పి తనతో తీసుకెళ్లాడు. తన స్నేహితులు మరో ఇద్దరితో కలిసి ఆమెపై ఓ ఇంటికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధితురాలు తల్లిదండ్రులు జరిగిన విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలిక ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు పనికోసమని హైదరాబాద్ కు వెళ్లారు.

ఆ బాలిక తన నాయనమ్మ, తాతయ్యతో కలిసి తమ ఇంటికి సమీపంలోని ప్రార్థనా మందిరానికి సాయంత్రం వెళ్లింది. అయితే మరుగుదొడ్డికి వెళ్లేందుకు బాలిక ప్రార్థనామందిరం నుంచి ఇంటికి ఒంటరిగా వస్తుండగా.. మాటు వేసిన ఓ మైనర్ నిందితుడు ఆమెను మార్గమధ్యలో ఆపి.. మీ తమ్ముడు కిందపడిపోయాడు, దెబ్బలు తగిలాయని త్వరగా రా.. అంటూ ఆమెను బైకుపై ఓ ఇంటికి తీసుకె ళ్లాడు. అప్పటికే ఆక్కడ మరో ఇద్దరున్నారు.

అనంతరం ముగ్గురూ కలిసి బాలికపై లైంగిక దాడి చేశారు. వారి నుంచి తప్పించుకొని రాత్రి తన ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిదంతా తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ యువకుడు, ఇద్దరు మైనర్లపై పోలీసులు పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.