BIGG BOSS 9 Telugu : బిగ్‌బాస్ సీజన్ 9 లో ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హౌజ్ నుంచి దివ్వెల మాధురి ఔట్ అయిపోయారు. తొలిసారి నామినేషన్స్‌లోనే మాధురికి అభిమానులు ఊహించని షాకిచ్చారు. ఓటింగ్ తక్కువగా రావడంతో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ లోకి ఫైర్ బ్రాండ్ గా మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఆయితే ఆమె 3 వారాల్లోనే హౌజ్ నుంచి బయటకు వచ్చారు.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దివ్వెల మాధురితో పాటుగా సంజన,రాము రోథోడ్, కళ్యాణ్ పడాల, తనూజ, రీతూ, డెమాన్, గౌరవ్ ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చిన దివ్వెల మాధురి, గౌరవ్.. ఈ ఇద్దరికి ఓటింగ్ లీస్ట్ ఓటింగ్‌లో ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన దివ్వెల మాధురి ఈ వారంఎలిమినేట్ అయ్యారు. ఈ విషయాన్ని నాగ్ అధికారికంగా ఈ రోజు ప్రకటించనున్నారు.
అయితే ఈ ఎలిమినేషన్ వెనుక బిగ్‌బాస్ టీమ్ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హౌస్‌లో గేమ్ రసవత్తరంగా సాగడానికి, లేదా భవిష్యత్తులో ఆమెను సీక్రెట్ రూమ్ కు పంపే వ్యూహంలో భాగంగా ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు.
