BIG BREAKING : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌పై ఆరోపణలుండగా… ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అనే వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
BIG BREAKING : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్! pic.twitter.com/xqS0VvnANo
— kotlata (@kotlataweb) November 2, 2025
ఈ క్రమంలో ఆదివారం ఉదయం జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం కుట్ర అని ఆరోపించారు.
