RTC : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఢీకొన్న తర్వాత బస్సుపై బోల్తా పడింది టిప్పర్ లారీ. ఈ ప్రమాదంలో 12మృతి చెందగా 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్పాట్‌లో లారీ డ్రైవర్ మృతి చెందగా.. అతని డెడ్ బాడీ ఇరుక్కుపోయింది. గాయపడిన వారిని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన
బస్సును ఢీకొట్టిన లారీ, పలువురికి తీవ్ర గాయాలు
బస్సులో 70 మంది ప్రయాణికులు
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు.. pic.twitter.com/mYYyYGqB96
— Sarita Avula (@SaritaAvula) November 3, 2025
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఈ ఘటన జరగగా… చేవెళ్ల-వికారాబాద్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో తాండూర్ డిపో బస్సు ప్రమాదానికి గురైంది. లారీలో ఉన్న కంకర పడటంతో బస్సులో ప్రయాణికులు కూరుకుపోయారు. బస్సులో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది బయటకు తీస్తున్నారు.
