BUS Accident : కజిన్ పెళ్లికి వెళ్లి వస్తుండగా .. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి!

sisters

BUS Accident :  చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 24కి చేరింది మృతుల సంఖ్య. ఇద్దరు డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో తల్లీబిడ్డా కూడా ఉన్నారు. పిల్ల వయసు 10 నెలలు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తనుషా, సాయి ప్రియ, నందిని అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు (పెళ్లికూతురు పక్కన నిల్చున్న ముగ్గురు యువతులు)మృతి చెందారు.

హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ డిగ్రీ చదువుతున్నారు ఈ అక్కాచెల్లెల్లు. కజిన్ పెళ్లి కోసం తాండూరుకు వెళ్లిన ముగ్గురు సిస్టర్స్.. పెళ్లి చూసుకుని ఈ ఉదయం హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదంలో చనిపోయారు.

మృతులు తాండూరు వడ్డెర గల్లీకి చెందిన వారిగా గుర్తించారు. తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలుగా గుర్తించారు. ఇక ఇదే ప్రమాదంలో అఖిల రెడ్డి అనే ఓ యువతి కూడా చనిపోయింది. దీంతో వీరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించారు. మృతుల్లో ఎక్కువగా తాండూరు, చెవేళ్ల వాసులే ఉన్నారు.

హైదరాబాద్‌ నుంచి తాండూర్‌కు పెళ్లికి వచ్చిన MBBS విద్యార్థులు కూడా ఉన్నారు. తాండూరు నుంచి ఉ.4.40 గంటలకు బయల్దేరిన బస్సు.. ఉదయం 6.30 గంటలకు ప్రమాదం జరిగింది. టిప్పర్ పడిన సైడ్ కూర్చున్న 21 మంది స్పాట్‌లోనే మృతి చెందారు.