BUS Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదం… చావుబతుకుల్లో మరో 20 మంది!

chevella

BUS Accident :  చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి చేశారు.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించారు ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారుప్రధాని మోడీ. మరోవైపు బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా.. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

బస్సు ప్రమాదంపై మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, డీజీపీ, సీపీల టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకుని బాధితులను పొన్నం పరామర్శించారు. రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకున్నారు అనేది త్వరలో బయటకు వస్తుందని. ఈ ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24కి చేరింది మృతుల సంఖ్య.. ప్రమాదంలో 40 మంది గాయపడగా 20 మంది పరిస్థితి విషమం ఉంది. ఇప్పటికే 24 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. చేవెళ్ల ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉన్న వారిని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించారు. ఇక మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తనుషా, సాయి ప్రియ, నందిని మృతి.. మృతులు తాండూరు వడ్డెర గల్లీకి చెందిన వారిగా గుర్తించారు. అటు చేవెళ్ల బస్సు ప్రమాదంపై సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.. కంట్రోల్ రూం నెంబర్లు 9912919545, 9440854433.

ఈ రోడ్డు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.