BIG BREAKING : ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన జనం

BIG BREAKING

BIG BREAKING :  విశాఖలో స్వల్ప భూకంపం వచ్చింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు భూప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రుషికొండ,భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప సమయంలో శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

కొంతమంది ఇళ్ళల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం ఏం జరగలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.