BIG BREAKING : ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన కీలక సూత్రధారులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ, అతని సహచరుడు ఉమర్ విచారణలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి పండుగల సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా వెల్లడించారు.
🔴#BREAKING | Delhi Blast Suspects Recced Red Fort, Planned Strike For January 26: Sourceshttps://t.co/7EHtMvL8ue
NDTV's @AaquilJameel joins @ParmeshwarBawa with more details#DelhiBlast pic.twitter.com/7A242pXjZf
— NDTV (@ndtv) November 12, 2025
దీని ద్వారా దేశంలో అలజడి సృష్టించాలని ఈ ముఠా లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపింది. ఈ ముఠా సభ్యులు వివిధ ప్రదేశాలలో పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్ , మందుగుండు సామగ్రిని నిల్వ చేసినట్లు అంగీకరించారు. అయితే ట్రైల్స్ లో భాగంగా ఢిల్లీ శివార్లలో ఓ సిక్రెట్ ఏరియాలో బ్లాస్ట్ నిర్వహించినట్లు కూడా అంగీకరించారు. గత ఆరు నెలల్లో చాలా సార్లు ఎర్రకోట ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థల ముందు వెల్లడించారు.
ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కుట్రలో కూడా వీళ్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం తరచుగా రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి, భారీ ప్రాణనష్టం కలిగించాలనే ప్రధాన ఉద్దేశంగా పెట్టు్కున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఆత్మాహుతి దాడితో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం సాయంత్రం రద్దీగా ఉండే సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి, 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
