KCR ఆరోగ్యంపై CM రేవంత్ సంచలన ప్రకటన

cm revanth reddy

KCR : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే గానే ఉందని అన్నారు. ప్రస్తుతం  ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరని.. ఆయనను విమర్శిచడం సరికాదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆయనపై స్పందిస్తానని సీఎం చెప్పారు. కేటీఆర్, హరీష్ ఇద్దరూ కేసీఆర్ కుర్చీని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వారి పరిస్థితి ఎంటో చూసుకోవడానికి వారికి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వదిలేశారని రేవంత్ అన్నారు. హరీష్ అసూయను, కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలని సీఎం రేవంత్  పిలుపునిచ్చారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సీఎం రేవంత్.. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉంది.. రెండేళ్లు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయండి.. సమస్యలు ఉంటే ప్రశ్నించండి, ధర్నాలు చేయలన్నారు. కాంగ్రెస్ ఒక్కతాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ ని ఓడించలేరని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఫేక్‌ న్యూస్‌ రాయించి ఫేక్‌ సర్వేలు చేయించుకొని భ్రమలో బతకొద్దన్నారు సీఎం రేవంత్ .. బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీకి డిపాజిట్‌ రాదని తాను  ముందే చెప్పానని ఇప్పుడు అదే జరిగిందన్నారు. జూబ్లీహిల్స్‌లో తమకు మద్దతు ఇచ్చిన ఎంఐఎంకు, అసదుద్దీన్‌ ఒవైసీకి కాంగ్రెస్‌ కార్యకర్తల పక్షాన ధన్యవాదాలు చెప్పారు. వచ్చే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పాలిస్తుందని, మార్పు చేసి చూపిస్తామని రేవంత్ వెల్లడించారు.