TDP : ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో మండల, కస్టర్, యూనిట్ గ్రామ బూత్ ఇన్చార్జిల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తానని హెచ్చరించారు. టీడీపీ పార్టీకి కార్యకర్తలే పునాదులని అలాంటి వారిని అధికారులు గౌరవించకపోతే బదిలీలు తప్పవని సూచించారు.
టీడీపీ పార్టీలో గతంలో తనకు పదవులు రాకపోయినా ఎప్పుడు కూడా అసంతృప్తి చెందలేదని కార్యకర్తలకు తెలియజేశారు. పదవులు ముఖ్యం కాదని పార్టీ సిద్ధాంతమే ముఖ్యమని నూతన ఉత్తేజంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలన్నారు. టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు సంయుక్తంగా కలిసి గ్రామాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.
