లారీని RTC బస్సు ఢీ..జనగామలో దారుణం!

rtc bus

RTC : వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. స్పాట్‌లోనే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

నిడిగొండ వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని.. వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మృతుల్లో ఒకరు దోమలగూడ వ్యక్తిగా గుర్తించారు. మరొకరు హన్మకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

మృతులను ఓం ప్రకాష్‌, నవదీప్‌ సింగ్‌గా గుర్తించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ధాటికి బస్సు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైంది.