BJP ; ఇటీవల జరిగిన జుబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.ఆ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 17,056ఓట్లతో డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా, ఈసారి అది మరింత తగ్గిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2023 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డిని మళ్లీ బరిలోకి దించడంపై పార్టీలో ప్రశ్నలు తలెత్తాయి. బలమైన లేదా బీసీ నాయకుడిని ఎంపిక చేయకపోవడం ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. బీజేపీకి ఓటు వేసిన 17,056మంది కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని తెలిపారు.
కనీసం మీరైనా హిందువులుగా బ్రతికి ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ పైడి రాకేష్ రెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో హిందువులు ఆయనపై ఫైర్ అవుతున్నారు.
— Paidi Rakesh Reddy MLA (@MLA_RakeshReddy) November 15, 2025
BJP కీ ఓటు వేస్తేనే హిందువులా …
బీజేపీ కీ ఓటు వేయకుంటే హిందువులు కదా …
మొన్నటి వరకు రాజసింగ్ వేసిన వాళ్ళు ఎవరు …
నిన్న గెలిచి ఎదో ఎగిరి ఎగిరి పడుతున్నావ్ …
అసలైన హిందువుల పార్టీ ఉందా …
బీజేపీలో ముస్లింలు, క్రైస్తవులు లేరా …
మరి ఎవరు కట్టర్ హిందువులు
గెలిపించింది కూడా హిందువునే
నవీన్ యాదవ్ హిందువే కదా……………. అని కామెంట్స్ చేస్తున్నారు.
BJP కీ ఓటు వేస్తేనే హిందువులా …
బీజేపీ కీ ఓటు వేయకుంటే హిందువులు కదా …
మొన్నటి వరకు రాజసింగ్ వేసిన వాళ్ళు ఎవరు …
నిన్న గెలిచి ఎదో ఎగిరి ఎగిరి పడుతున్నావ్ …
అసలైన హిందువుల పార్టీ ఉందా …
బీజేపీ లో ముస్లింలు, క్రైస్తవులు లేరా …
మరి ఎవరు కట్టర్ హిందువులు— KOLA RAJUGOUD (@rajugoud_kola) November 16, 2025
