BIG BREAKING : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.. తదనంతర విచారణకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ – ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ – కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొంతకాలం కిందట గవర్నర్ కు లేఖ రాసిన ప్రభుత్వం.#KTR#FormulaERase#FormulaEcase#BRS#Telangana pic.twitter.com/tT4qhEavKz
— C L N Raju (@clnraju) November 20, 2025
కాగా ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా ఏసీబీ పేర్కొంది. గవర్నర్ తాజాగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు కేటీఆర్‌తో పాటుగా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. త్వరలో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాలలో, పరిపాలనా వర్గాలలో నడుస్తోంది.
