Pakistan : ఈ వార్త తెలిస్తే పాక్ నోట్లో ఉమ్మేస్తారు..ఎన్నో మోసాలు చూశాం కానీ..!

Pakistan

Pakistan : మిత్రదేశాలను మోసం చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడోహద్దులు దాటింది. తాజాగా మరోసారి తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది. తీవ్ర తుఫానతో శ్రీలంక ఆల్లాడిపోతుంది. ఈ క్రమంలో మిగితా దేశాలతో పాటుగా మానవతా సాయం అందిస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకునేందుకు పాకిస్తాన్ హైకమిషన్ ఆహార ప్యాకేజీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోల్లోనే పాక్ మోసం స్పష్టంగా బయటపడింది.

ప్యాక్ చేసిన నీళ్లు, పాలు, బిస్కెట్లు వంటి నిత్యావసరాలపై ముద్రించిన ఎక్స్‌పైరీ తేదీ అక్టోబర్ – 2024 అని ఉండటం గమనార్హం. అంటే దాదాపు ఏడాది క్రితమే గడువు ముగిసిన వస్తువులను అత్యవసర సహాయంగా పంపి, బాధితుల ప్రాణాలతో పాక్ చెలగాటమాడింది. అంతేకాకుండా ఈ సహాయక సామాగ్రి కనీసం 10 కుటుంబాలకు కూడా సరిపోని పరిమాణంలో ఉండటం పాక్ చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తించింది.

పాకిస్తాన్ చర్యపై అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఇది పాకిస్తాన్ నీచమైన బుద్ధి.. చెత్తకుప్పలో వేయాల్సిన సరుకులను సాయం పేరుతో పంపారు” అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పాకిస్తాన్‌కు దౌత్యపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టడమే కాకుండా, విపత్తు సహాయం విషయంలో ఆ దేశం విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. ఇప్పటివరకు పాక్ గవర్నమెంట్ దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ఆపరేషన్ సాగర్ బంధు కింద భారత్ నవంబర్ 28 నుండి వాయు, సముద్ర మార్గాల ద్వారా శ్రీలంకకు 53 టన్నుల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది. శ్రీలంక నుండి చిక్కుకున్న 2,000 మందికి పైగా భారతీయులను కూడా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

భయంకరమైన దిత్వా తుఫాన్ ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్‌లో ఊహించని నష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ మూడు దేశాల్లో అతలాకుతలం సృష్టించిన ఈ తుఫాన్ కారణంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 1200లకు చేరింది. సుమారు 800 మందికిపైగా ప్రజలు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు.