టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవి సన్నిధిలో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత
అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీర ధరించి యోగ సంప్రదాయం ప్రకారం సామ్ - రాజ్ భూత శుద్ధి వివాహం ద్వారా ఒక్కటయ్యారు.
హీరోయిన్గా ఇప్పటికే భారీ స్థాయిలో సంపాదిస్తున్న సమంతకి.. రాజ్‌తో పెళ్లి తర్వాత ఆస్తి ఎంత ఉంటుందనే చర్చ మొదలైంది.
హీరోయిన్గా సమంత భారీ స్థాయిలో సంపాదించింది. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్, వ్యాపారాల్లో పెట్టుబడులతో కోట్లలో సంపాదిస్తోంది.
సమంత ఒక్కో సినిమాకి 3 నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ఇలా సినిమాలు, బ్రాండ్ డీల్స్, బిజినెస్‌ల ద్వారా సమంత ఏడాదికి దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లో ఆమెకు సుమారు 18 కోట్లు విలువైన ఒక విల్లా ఉంది. అదనంగా, సిటీలోనే 7.8 కోట్ల రూపాయల విలువైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ కూడా ఉంది. అలాగే ముంబైలో సముద్రం ఎదురుగా సీవ్యూ ఉండేలా 15 కోట్ల విలువైన 3BHK ఫ్లాట్ కూడా ఉంది.
సమంతకు లగ్జరీ కార్లు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె గ్యారేజీలో Audi Q7, Porsche Cayman GTS, Mercedes Benz G63 AMG, BMW 7-Series, Jaguar XF వంటి హైఎండ్ కార్లు ఉన్నాయి.
డైరెక్టర్ రాజ్‌కి 85 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉంది. మొత్తంగా రాజ్‌తో పెళ్లి తర్వాత సమంత నెట్ వర్త్ దాదాపు 185 కోట్ల రూపాయలుగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.