BIG BREAKING : ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ రాజీనామా!

danam nagendar

BIG BREAKING : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని చెప్పుకొచ్చారు. తనకు ఎన్నికలు కొత్త కాదన్న దానం.. . ఇప్పటికి 11 సార్లు కొట్లాడిన చరిత్ర తనకు ఉందన్నారు. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని.. తన వాదనలు వినిపిస్తానని చెప్పుకొచ్చారు.

ఇక రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్‌ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్‌నగర్‌, నారాయణగూడలో రూ.1.40కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై ఈ విధంగా దానం స్పందించారు.

దానంతో పాటుగా ఎమ్మెల్యే కడియం చేత కూడా సీఎం రేవంత్ రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో మరో రెండు ఉప ఎన్నికలు రావడం ఖాయమని రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తోంది.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించబడితే, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. స్పీకర్ మళ్లీ ఆలస్యం చేస్తే, కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవడంతో పాటు, న్యాయస్థానమే ఈ విషయంలో కీలక జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి స్పీకర్ కార్యాలయంలో విచారణలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు విధించిన గడువులోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.