Madhu Priya : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి -డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. పండగకి వస్తున్నారు… అనేది క్యాప్షన్.. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేయగా.. ఇప్పుడు శశిరేఖ అంటూ అలరించేందుకు టీమ్ సిద్ధమైంది. ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను రిలీజ్ చేశారు.
డిసెంబర్ 8న ఈ పూర్తి పాట విడుదల కానుంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ కలిసి ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. చూస్తుంటే ఈ పాట కూడాగోదారి గట్టు మీద రామచిలుక వే అనే రేంజ్ లో హిట్ అయ్యేలా ఉంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్‌లలో సందడి చేయనుంది.
