Telangana : సౌతాఫ్రికాలో తెలంగాణ యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్‌

praveen

Telangana : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు విదేశాల్లో కిడ్నాప్‌కు గురయ్యాడు. ఉపాధి నిమిత్తం సౌతాఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన బండసోమారం వాసి ప్రవీణ్‌ను ఉగ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. ప్రవీణ్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బండసోమారం.

ప్రవీణ్ నవంబర్ 23వ తేదీన డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా JNIM ఉగ్రవాదులు అతడిని కిడ్నాప్‌ చేశారు.నవంబర్ 23వ తేదీ నుంచి ప్రవీణ్ మొబైల్ ఫోన్ స్విచాఫ్ రావడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉగ్రవాదులు అతడిని బందీగా పట్టుకున్నట్లు తెలియడంతో కుటుంబంలో ఆందోళన మొదలైంది.

తమ కొడుకును ఎలాగైనా సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని, విదేశాంగ మంత్రిత్వ శాఖను కన్నీటితో వేడుకుంటున్నారు. సౌతాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మాలి ప్రభుత్వంతో మాట్లాడి తమ కొడుకును ఉగ్రవాదుల చెర నుంచి విడిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.