Pragathi : వారేవా ప్రగతి ఆంటీ కొట్టేసింది.. పవర్‌ లిఫ్టింగ్‌లో నాలుగు మెడల్స్‌!

Pragathi

Pragathi :  ఒకపక్కా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే. . పవర్ లిఫ్టింగ్ లో కూడా తన ప్రతిభను కనబరుస్తుంది నటి ప్రగతి . దేశ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొంటూ పతకాలు గెలుచుకుంటూ సత్తా చాటుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రగతి అదరగొట్టింది.

తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ లో ఏకంగా నాలుగు పతకాలు సాధించింది ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె వెల్లడించింది. ఏషియన్‌ గేమ్స్‌లో మొత్తంగా సిల్వర్‌ మెడల్‌ సాధించగా, డెడ్‌ లిఫ్ట్‌నకు గోల్డ్‌ మెడల్‌ దక్కింది. అలాగే బెంచ్‌ స్క్వాడ్‌ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్‌ మెడల్స్‌ కూడా ప్రగతి సాధించింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.

ఇక నవంబరు 2023లో బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన 2024లో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ప్రగతి 2025లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. ఒకే ఈవెంట్‌లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది.

ఏప్రిల్ 17 1975న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఉలవపాడులో జన్మించారు ప్రగతి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లికి చేదోడుగా ఉండటానికి చెన్నైలో స్థిరపడ్డారు. ఈ సమయంలోనే ఆమె కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చేసేవారు. చిన్న వయస్సులోనే (సుమారు 20 ఏళ్లకే) పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుని, తన పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.

కాలేజీలో ఉన్నప్పుడే చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ ప్రకటనల్లో మోడల్‌గా కనిపించారు. ఈ ప్రకటనను చూసిన తమిళ దర్శకుడు కె. భాగ్యరాజ్ తన సినిమా ‘వీట్ల విశేషంగా’ (1994)లో ప్రగతికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. తొలినాళ్లలో రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమాలో (కీర్తనం – 1995) హీరోయిన్ గా నటించారు.