Nayanam : సైకోగా వరుణ్.. హాట్ గా ప్రియాంక!

nayanam

Nayanam : వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ నయనం. స్వాతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ డిసెంబర్‌ 19 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా దీని ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వరుణ్ సందేశ్ కంటి డాక్టర్ పాత్రలో కనిపించారు. బుల్లితెర నటి ప్రియాంక జైన్ హీరోయిన్ గా నటించింది.

ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇతరులు కళ్లద్దాల నుంచి నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది తాను చూడగలనని వరుణ్ క్యారెక్టర్ చెప్తుంది. అందుకోసం ఓ అమ్మాయి కళ్లను చూసి డాక్టర్ లవ్ లో పడతాడు. ఆవిడే ప్రియాంక.. ఆమెకు అప్పటికే పెళ్లి కూడా అయిపోతుంది. అతను హత్యకు గురవుతాడు.

ఈమె పాత్ర కాస్త హాట్ గా ఉంది. ఆ హత్యను ఎంక్వైరీ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా అలీ రెజా కనిపించనున్నాడు. ఏంటీ ఫుల్ కథ అంటే డిసెంబర్‌ 19వరకు ఆగాల్సిందే. ఉత్తేజ్, నిరోష, హరీష్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ను ఎస్ఆర్టీ ఎంటర్ టైనర్స్ బ్యానర్ పై ఈ సిరీస్ ను రామ్ తళ్లూరి, రజనీ తళ్లూరి నిర్మించారు.