Hyderabad : కామంతో కళ్లు మూసుకుపోయి, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కాలయముడిలా మారి కడతేర్చిందో భార్య. ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకోవడమే కాకుండా, చివరకు పోలీసుల చేతికి చిక్కి జైలు పాలైంది.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ వివాహిత. అనంతరం భర్త గుండెపోటుతో చనిపోయాడని అందర్ని నమ్మించింది. అయితే పోస్టుమార్టం రిపోర్టుతో అసలు భాగోతం బయటపడింది.
ఇక వివరాల్లోకి వెళ్తే… బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిల వీకే అశోక్ (45), పూర్ణిమ (36) దంపతులకు 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. వారికి 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అశోక్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాబ్ చేస్తుండగా, పూర్ణిమ ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటుంది. ఈ క్రమంలో ఏడాది క్రితం అదే కాలనీకి చెందిన పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడగా .. అది కాస్త అక్రమసంబంధానికి దారి తీసింది.
అయితే ఈ విషయం భర్త అశోక్ కు తెలియడంతో పలుమార్లు భార్యను హెచ్చరించాడు. ప్రియుడితో గడపడం కష్టం అవుతుందని భావించిన పూర్ణిమ .. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్రకు దిగింది పూర్ణిమ.. మహేశ్‌తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది.
అశోక్‌ను హత్య చేయడానికి మహేశ్ తన ఫ్రెండ్ సాయికుమార్ (22) సహయం తీసుకున్నాడు. ప్లాన్ లో భాగంగా డిసెంబర్ 11న మధ్యాహ్నం మహేశ్, సాయి పూర్ణిమ ఇంటికి వచ్చి ఓ గదిలో దాక్కున్నారు. సాయంత్రం అశోక్ ఇంటికి రాగానే ముగ్గురు కలిసి అతడి చేతులు, కాళ్లు పట్టుకొని చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు.
అయితే తన భర్త అశోక్ గుండెపోటుతో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది పూర్ణిమ .అయితే పోస్టుమార్టం రిపోర్టులో గొంతుకు ఉరి బిగించడమే మృతికి కారణమని తెలియడంతో పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఉన్నదంతా కక్కెసింది. దీంతో పోలీసులు పూర్ణిమతో పాటు మహేశ్, సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
