Maadhavi Latha : కొంపముంచిన కామెంట్స్.. మాధవీలతపై కేసు

madhavi latha

Maadhavi Latha :  సినీ నటి, రాజకీయ నేత మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమె చుట్టూ మరో వివాదం ముసురుకుంది. షిరిడీ సాయిబాబాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఆమెపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సాయిబాబాను ఉద్దేశించి మాధవీలత సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులు అందాయి. గతంలోనూ పలు సామాజిక, రాజకీయ అంశాలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఏకంగా పోలీసు కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.