KCRకు సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్!

cm revanth reddy

KCR : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అయిపోతుంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారం కలిసొచ్చేలా సీఎం జిల్లాల పర్యటన ఖరారైంది.

వచ్చే నెల మూడో తేదీ నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఉండబోతుంది. ఫిబ్రవరి 03వ తేదీన జడ్చర్లలలో సీఎం రేవంత్ బహిరంగ సభ ఉండనుంది. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో సీఎం జిల్లాల పర్యటనతో రంగంలోకి దిగారు.

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు, తొలి సభ కొండగల్ లోనే ఉంటుందని జోరుగా ప్రచారం నడుస్తోంది.