BIG BREAKING : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. వారిని ఇప్పటికే వెనిజులా నుండి విమానంలో తరలించినట్లు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు.
వెనిజులాపై అమెరికా విజయవంతంగా భారీ దాడులు నిర్వహించిందని ట్రంప్ పేర్కొన్నారు. మదురో, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని, ఇప్పటికే దేశం వెలుపలికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.
కాగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలో ఇవాళ వెనెజువెలా రాజధాని కరాకస్‌లో ఏడు చోట్ల పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.
శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారకాస్ నగరం అంతటా వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. నగరంపై తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలు తిరగడం చూశామని, పేలుళ్ల ధాటికి భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారని స్థానికులు తెలిపారు.
