Tamil Nadu : నిఖితా గోడిశాల హత్య కేసులో సంచలన ట్విస్ట్!

Tamil Nadu

Tamil Nadu :  అమెరికాలో తెలుగు యువతి నిఖితా గోడిశాల హత్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మను ఇంటర్‌పోల్ పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. మేరీల్యాండ్‌లో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల నిఖితా రావు జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) స్వయంగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ అమెరికా వదిలి భారత్‌కు పరారయ్యాడు. దీనితో పోలీసులకు అనుమానం వచ్చి, కొలంబియాలోని అతని అపార్ట్‌మెంట్‌ను సోదా చేయగా, జనవరి 3న అక్కడ నిఖితా డెడ్ బాడీ దొరికింది. నిఖితా శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇది గృహ హింస లేదా వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యగా నిర్ధారించి, అర్జున్‌పై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు.

అర్జున్ శర్మ భారత్‌కు పారిపోవడంతో, అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు, భారత అధికారులు సమన్వయంతో వ్యవహరించారు. ఇంటర్‌పోల్ పోలీసులు నిరంతరం నిఘా ఉంచి, చివరకు తమిళనాడులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే అతన్ని అమెరికాకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం కానుంది.