Love Marriage : మతాంతర వివాహం.. పోలీస్ స్టేషన్‌లో సుఖాంతం

love marriage

Love Marriage : ఆమె హిందూ.. అతను ముస్లిం .. ఇద్దరు ప్రేమించుకున్నారు..అందరి తల్లిదండ్రులు లాగే వీరి పేరెంట్స్ కూడా పెళ్లికి నో చెప్పారు. దీంతో బయటకు వెళ్లి ఓ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

అంబర్‌పేటలోని ఖాద్రిబాగ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(27) ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.గోల్నాకలోని సంజీవయ్యనగర్‌ ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ(24)తో ప్రేమలో పడ్డాడు. ఐతే వీరిద్దరి లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేశారు. అందుకు పేరెంట్స్ కుదరదు అని చెప్పడంతో ఇంట్లోంచి పారిపోయి 2 నెలల క్రితం చర్చిలో పెండ్లి చేసుకున్నారు.

ఈ విషయం తెలిసిన భవ్యశ్రీ తల్లి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని ఇమ్రాన్‌ పై ఫిర్యాదు చేసింది. దీంతో కాచిగూడ ఏసీపీ హరీశ్‌కుమార్‌ వారిద్దరిని పిలిపించారు. దీంతో మేమిద్దరం మేజర్లమని, ఇద్దరం ఇష్టపడే పెండ్లి చేసుకున్నామని ఇమ్రాన్‌, భవ్యశ్రీ చెప్పారు. ఇరువురి తల్లిదండ్రులను పీఎస్‌కు పిలిపించి వారిముందే పెళ్లి జరిపించారు హరీశ్‌కుమార్‌ .

పోలీస్‌స్టేషన్‌లోనే సయ్యద్‌ ఇమ్రాన్‌ భవ్యశ్రీ మెడలో తాళి కట్టించి, పూలదండలు మార్పించారు. పోలీస్‌స్టేషన్‌లోనే పోలీసులు వీరిద్దరికి తాళి కట్టించి మతాంతర వివాహం జరిపించారు.