Anil Ravipudi సంక్రాంతి మొనగాడు.. రాజమౌళి తరువాత అసలైన మగాడు!

Anil ravipudi , rajamouli

Anil Ravipudi  :  మన శంకరవరప్రసాద్ గారు పండక్కి హిట్టు కొట్టేసారు. చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్టింగ్ మాములుగా ఉండదు ఇచ్చి పడేసాడు. ఎవరు ఎంత ట్రోల్ చేద్దామన్నా ఎక్కడా దొరకడు. ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఆఫ్టర్ కంబ్యాక్ లో చిరంజీవిని బాబీ తర్వాత కాదు బాబీ కంటే ఎక్కవు గా అనిల్ రావిపూడి వాడుకున్నంత గా ఎవరూ వాడుకోలేదు. పిండేసాడయ్య.

70s ఏజ్ లో కూడా 40+ లా ఉన్నాడు. ఆ ఈజ్, లుక్స్, ఆ గ్రేస్ మాములుగా లేదు. ఫాన్స్ పిచ్చ హ్యాపీ. నయనతార కూడా తళుక్కుమనే తారల మిలమిల మెరిసింది. చిరు నయన జోడీ బాగుంది, కెమిస్ట్రీ అదిరింది. నయన ఫాదర్ గా చిరు మావగా సచిన్ కేడ్కర్ రోల్ బాగుంది. రాజాసాబ్ లో ప్రభాస్ కి నానమ్మ గా చేసిన జరినా ఇక్కడ చిరుకి తల్లిగా చేయడం విశేషం, ఆమె రోల్ కూడా బాగుంది.

కేథరిన్, హర్షవర్ధన్, అభినవ గోమటం, శ్రీనివాస రెడ్డి ఉన్నా వాళ్ళకి కామెడీ చేసే స్కోప్ ఏం లేదు.పెద్దగా కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఎవరూ లేరు. సినిమా అంతా చిరు వన్ మ్యాన్ షో అంతే. అందరి కామెడీ చిరంజీవే చేసేసాడు. విలన్ ట్రాక్ కూడా పెద్దగా ఏం లేదు. వెంకీ గురించి తెలిసిందే గా గెస్ట్ గా వచ్చి కుమ్మేసాడు. చిరంజీవి, వెంకటేష్ వాళ్ళ రేంజ్ కి తగ్గ ట్రాక్ కాకపోయినా కామెడీ బాగా దట్టించడం వల్ల ఫాన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ గా ఎక్కేస్తాది.

భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. ఆ సాంగ్స్ ఇంకొంచెం క్వాలిటీగా, రిచ్ గా తీసుంటే బాగుండేది. BGM కూడా బాగా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ కి ఆడియెన్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. రావిపూడి ఎప్పుడూ అంతే ఫస్ట్ హాఫ్ బాగా తీసి సెకండ్ హాఫ్ కాలక్షేపం చేసేస్తాడు. ఇక్కడ కూడా అంతే వెంకీ ట్రాక్ బాగున్నప్పటికీ, సినిమా డ్రాగ్ చేయడానికి తప్పితే కథకి అంత అవసరం లేదు, వెంకీ ప్లేస్ లో కథ మీద ఫోకస్ చేసినా బాగుండేది.

సెకండాఫ్ లో కథ మీద అంత ఫోకస్ లేకపోయినా చిరు వెంకీ అల్లరి, ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్, మంచి ఫ్యామిలీ సీన్లు,సాంగ్స్ ఉండటం వల్ల ఆడియన్స్ కి హ్యాపీ గానే ఉంటుంది.

అనిల్ రావిపూడి కి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. చిరంజీవికి పిల్లలకి ఉండే ఎమోషన్ ఆ ట్రాక్ చాలా బాగా తీసాడు. చిరంజీవి ఫాన్స్ కి అనిల్ రావిపూడి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఈ సినిమా నచ్చేస్తుంది. హేటర్స్ కి, ట్రోలర్స్ కి తప్ప అందరికి నచ్చే పెర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ సినిమా. మెగాస్టార్ అభిమానులు కోరుకున్న విధంగా చూపించడంలో అనిల్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు అంతేకాక ఫ్యామిలీలతో ఈ సంక్రాంతికి థియేటర్స్ కి వెల్లేలా చేసారు.

ప్రేక్షకులకు దగ్గర కావడానికి టీవీలు, OTT ప్లాట్ఫామ్స్ హెల్ప్ అవుతాయని తెలిసి వాటిల్లో విశ్వరూపం చూపిస్తూ ఉండే అనిల్ రావిపూడి ను ఎవరూ ఆపలేరు.ఆ అవసరం కూడా లేదు. థియేటర్ కల్చర్ పోయి ఆ ప్లేస్ లో కళ్యాణ మండపాలు షాపింగ్ కాంప్లెక్స్ లు వచ్చేస్తున్నరోజులు.. సినిమా రిలీజ్ అవడం పాపం పైరసీ పేరుతో మొత్తం మొబైల్ లో వచ్చేస్తున్నా క్షణాలు.. అన్నీ తెలుసుకుని ,మార్కెట్ ను అంచనా వేసి ,తన ఇంట్రెస్ట్ ను యాడ్ చేసి సెలెక్టివ్ గా సినిమాలు తీసే అనిల్ రావిపూడి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు. రాజమౌళి తరువాత ఇండస్ట్రీలో  ప్లాప్ లేకుండా ఎదిగిన డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలిచాడు.