BIG BREAKING : ఫోటో కొట్టగానే పైసలు కట్ కావాలి .. రేవంత్ సంచలనం!

cm revanth reddy

BIG BREAKING : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ట్రాఫిక్ చలానాల విషయంలో చాలా కఠినంగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి పోలీసులకు సూచించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన అరైవ్‌ అలైవ్‌ రోడ్‌ సేఫ్టీ ప్రచార కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సీఎం హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కీలక కామెంట్స్ చేశారు.  వాహనంపై చలాన్‌ పడిన వెంటనే బ్యాంక్‌ అకౌంట్లో నుంచి డబ్బులు కట్‌ అయ్యేలా చూడాలన్నారు. ముందుగా వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తీసుకోవాలని … ఆ వివరాలను వాటితో అటాచ్ చేయాలని చెప్పారు.

చలాన్‌ పడిన వెంటనే అకౌంట్లో నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్‌ కావాలని రేవంత్‌ సూచించారు. త్వరలోనే దీనిని అమలు చేయాలని పోలీసులకు, రవణాశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇక దేశంలో ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని,మూడు నిమిషాలకో ప్రాణం పోతోందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3 శాతం మేర నష్టం కలుగుతుందన్నారు.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని సూచించారు.

మరోవైపు అందరూ కచ్చితంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు డీజీపీ శివధర్‌రెడ్డి. జనవరి 13 నుంచి 24 వరకు పది రోజుల పాటు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.