iPhone 17 : కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్(Flipkart ) అదిరిపోయే బంపరాఫర్ చెప్పింది.2026 జనవరి 17 నుంచి మొదలయ్యే రిపబ్లిక్ డే సేల్‌లో, ఆపిల్ లేటెస్ట్ మోడల్ iPhone 17 పై భారీ తగ్గింపు ఇస్తోంది. గత సెప్టెంబర్‌లో రూ. 82,900 కు లాంచ్ అయిన ఈ ఫోన్ (256GB), ఇప్పుడు ఆఫర్ల ద్వారా కేవలం రూ. 74,990 కే అందుబాటులోకి రానుంది.
ఈ తక్కువ ధరతో పాటు మీ దగ్గర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మరో 10 శాతం అదనపు తగ్గింపు పొందవచ్చు. అలాగే EMI కూడా ఉంది. మీకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా బ్లాక్ మెంబర్షిప్ ఉంటే, అందరికంటే ఒకరోజు ముందే అంటే జనవరి 16 నుంచే ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇది లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్ గ్రీన్ వంటి కొత్త కలర్స్ లో లభిస్తోంది.
తక్కువ ధరలో లేటెస్ట్ ఐఫోన్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి అవకాశం అని చెప్పాలి.
ఐఫోన్ 17లో కొత్తగా ఏముంది?
- పాత మోడల్స్ కంటే స్క్రీన్ పెద్దగా (6.3 ఇంచులు) ఉంటుంది. స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేయడమే కాకుండా, ఎండలో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
- దీనికి వాడిన గ్లాస్ చాలా గట్టిది. పొరపాటున ఫోన్ నీటిలో పడినా, దుమ్ములో ఉన్నా ఏమీ కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ (IP68) ఉంటుంది.
- ఇందులో వాడిన కొత్త చిప్ (A19) వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా చాలా వేగంగా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
- వెనుక వైపు రెండు పవర్ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం కూడా హై-క్వాలిటీ కెమెరాను ఇచ్చారు, దీనివల్ల ఫోటోలు చాలా స్పష్టంగా వస్తాయి.
Also Read :
