Ananya Nagalla : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల సంక్రాంతి పండుగ వేళ అచ్చతెలుగు ఆడపడుచులా ముస్తాబై అభిమానులకు కనువిందు చేసింది. వైట్ కలర్ బ్లౌజ్, పర్పుల్ కలర్ లంగా ఓణీలో ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జడలో పూలు, చేతులకు గాజులు, ముక్కుపుడకతో పద్ధతైన లుక్‌లో కనిపిస్తూ.. తన పెద్ద కళ్లతో చూస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ట్రెడిషనల్ లుక్‌లో అనన్య ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

