మీ యూరిన్ ముదురు పసుపు రంగులో వస్తుంటే వెంటనే నీళ్లు తాగాలని అర్థం.
నాలుక తడి ఆరిపోవడం, పెదవులు పగలడం డీహైడ్రేషన్‌కు ప్రధాన సంకేతం.
ఏ కారణం లేకుండా తల దడదడలాడుతుంటే అది బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే వార్నింగ్.
ఎంత నిద్రపోయినా అలసటగా, నీరసంగా ఉంటే ఒంట్లో నీళ్ల శాతం తక్కువ ఉందని గుర్తుంచుకోండి.
చర్మం కాంతిని కోల్పోయి, డల్ గా కనిపిస్తుంటే మీరు లోపల నీళ్లను పెంచాల్సిందే!
నీళ్లు తక్కువైతే నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గి, బ్యాక్టీరియా వల్ల దుర్వాసన వస్తుంది.
ఆకలిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగండి.. ఆకలి తగ్గితే అది కేవలం దాహమే!
రోజుకు కనీసం 3 నుంచి -4 లీటర్ల నీరు తాగండి. ఆరోగ్యంగా ఉండండి!