అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన : ఆ ఇద్దరికి పరిస్థితి కూడా…..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం జరిగిన ఘటనలో గాయపడిన మరో ఇద్దరికి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు… వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయారెడ్డి డ్రైవర్‌ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా వైద్యులు చెబుతున్నారు. కవాడిపల్లి వాసి బొడిగా నారాయణ గౌడ్‌ అనే వృద్ధుడు కూడా గాయపడ్డాడు. తన భూమి సమస్య పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి గాయాలపాలైన ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కూర సురేశ్‌కు ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కూడా 40 శాతం వరకు కాలినట్టు డాక్టర్లు చెబుతున్నారు.

రేపు విజయారెడ్డి అంత్యక్రియలు :

విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఆమె మృతదేహాన్ని నల్గొండ జిల్లా కాల్వలపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. రేపు విజయా రెడ్డి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.

Leave a Reply