లంచం అడిగిన ఎమ్మార్వో… ప్రెట్రోల్ పోసి నిప్పంటించిన రైతు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అబ్దుల్లా పూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై…ఓ రైతు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన తహశీల్దార్ విజయరెడ్డి అక్కడిక్కడే చనిపోయింది. మంటల్లో కాలిపోతున్న ఆమెను కాపాడ్డానికి డ్రైవర్, అటెండర్ ప్రయత్నించినా…ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మంటల్లో కాలిపోయింది.

తహశీల్దార్‌ను సజీవ దహనం చేసిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. నిందితుడు గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్ గా గుర్తించారు పోలీసులు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయ తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని నిందితుడు పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. తనను వేధించారని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే ఆమెను సజీవదహనం చేశానని పోలీసుల విచారణలో రైతు సురేష్ చెప్పినట్టు తెలుస్తోంది.

నిందితులపై కఠిన చర్యలు.
తహశీల్దార్‌ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

Leave a Reply