Abhishek Sharma World Record : టీ20 నంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 5000 టీ20 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డుల్లోకెక్కాడు.
Abhishek Sharma storms past 5000 T20 runs in fewer balls than any other player 🔥 pic.twitter.com/K8shrhUXLn
— ESPNcricinfo (@ESPNcricinfo) January 21, 2026
ఓపెనర్‌గా వచ్చిన ఈ 25 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. కివీస్ బౌలర్లను ఉతికేశాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 84 పరుగులు చేసి తన సత్తా చాటాడు. అత్యంత తక్కువ బంతుల్లోనే అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు.
గతంలో వెస్టిండీస్ వీరుడు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ చెరిపివేశాడు. రస్సెల్ 5000 పరుగులు చేయడానికి 2942 బంతులు తీసుకోగా, అభిషేక్ అంతకంటే వేగంగా ఈ ఫీట్ సాధించాడు.
Impressive bowling by Jacob Duffy at just 6.75 Eco. rate 👏
Currently he is part of RCB team#INDvsNZ pic.twitter.com/t7GSROOpJF
— Abba's Notebook (@AbbasNotebook) January 21, 2026
ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో వచ్చిన రింకూ సింగ్ తన స్టైల్లో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 44 పరుగులు (నాటౌట్) చేసి స్కోరును 230 దాటించాడు. కెప్టెన్ సూర్య కూడా తన వంతుగా 22 బంతుల్లో 32 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
మొత్తానికి నాగ్‌పూర్ స్టేడియం సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్‌ను మన బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి!
