Akhanda 2 : ఈ బ్యూటీ ఎవరో గుర్తుందా.. పదేళ్ల తరువాత మళ్లీ!

Akhanda 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కూతురు పాత్రకు బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రాని తీసుకున్నారు.

ఇప్పుడు ఈమె ఎవరనే చర్చ నడుస్తోంది. భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఈ డ్రామా చిత్రంలో ఆమె పోషించిన మున్నీ (మూగ, చెవిటి చిన్నారి) పాత్రతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ పాత్రకు ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్‌ను కూడా పొందింది.ఆమె నటనకు 2022లో భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డును కూడా అందుకుంది.

ఫెయిర్ & లవ్లీ, పియర్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హార్లిక్స్ వంటి అనేక ప్రకటనలలో కూడా కనిపించింది. 2008 జూన్ 3న మహారాష్ట్రలో జన్మించింది.ఇప్పుడు ఈమెకు 17 ఏళ్లు.

పదేళ్ల తరువాత ఇప్పుడు అఖండ 2లో నటిస్తుంది.అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హర్షాలీ ఇలా నీలి గాగ్రా చోళీ డ్రెస్ లో మెరిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈమె చుట్టే కథ తిరుగుతుంది.

ఈ చిత్రంలో ఆమె కీలకమైన జనని పాత్రలో నటించింది.ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. అఘోర పాత్రకు సంబంధించిన త్రిశూలం (ఆయుధం)ను కొత్తగా, పవర్‌ఫుల్ మైథాలజీ టచ్‌తో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.