బ్యాంకుల టైమింగ్ మారింది. మొత్తం మూడు వేళల్ని నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (IBA). ఐబీఏ నిర్ణయించిన వేళలు..
1. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు
3. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ఇవాళ్టి (అక్టోబర్ 1) నుంచే కొత్త వేళలు అమలులోకి వచ్చాయి. కస్టమర్లకు సేవల్ని మరింత సమర్థవంతంగా అందించేలా బ్యాంకు వేళల్ని మార్చాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. పలు వర్గాల నుంచి ఈ డిమాండ్లు రావడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బ్యాంకింగ్ డివిజన్ బ్యాంకు వేళల్ని సమీక్షించే అంశంపై దృష్టిపెట్టింది. కస్టమర్లకు అనుకూలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వేళల్ని మార్చాలని నిర్ణయించింది. ఇదే విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్‌లో ఓ సమావేశం నిర్వహించింది. కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి బ్యాంకు వేళలు ఉండాలని సూచించింది. అందుకు తగ్గట్టుగా వేళల్ని మార్చేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.