హెల్మెట్‎తో పాటు దవడ పగిలింది : ఆస్ట్రేలియా కీపర్‎కు తీవ్రగాయం

సెకండ్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ అలెక్స్ క్యారేకు తీవ్ర గాయమైంది. 8 ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి క్యారే హెల్మెన్ ని పచ్చడి చేసింది. హెల్మెట్ ఊడిపోయింది. హెల్మెట్ ను చీల్చుకుంటూ వెళ్లిన బాల్… క్యారీ దవడ ముందు భాగాన్ని బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిపోయిన క్యారీ… డ్రెస్సింగ్ రూమ్ కు సైగలు చేశాడు. అసీస్ ఫిజియో వచ్చేసరికి దవడ కింది భాగం నుంచి రక్తం కారుతోంది. దాంతో అతను రిటైర్ట్ హర్ట్ అవుతాడని అనుకున్నారంతా. ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని మళ్లీ బ్యాటింగ్ కు దిగాడు. అసీస్ 14 పరుగులున్నప్పుడు హ్యాండ్స్ కాంబ్ ఔటవడంతో క్యారీ క్రీజులొకొచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే గాయమైంది. దాంతో ఆస్ట్రేలియా టెన్షన్ పడింది. అయితే మొండిపట్టుదలతో ఆడిన క్యారీ కొద్దిసేపటికే ఔటయ్యాడు.

LEAVE A REPLY