రేయ్…. ఇటు రారా… సీఐని పిలచిన ఎంపీ !

అనంతపురం జిల్లా కొడిమి గ్రామంలో అరుదైన ద్రుశ్యం చోటు చేసుకుంది. వనమహోత్సవ కార్యక్రమానికి ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. పోలీసుల బందోబస్తు, అతిథులు, కార్యకర్తలు, ప్రజలతో ప్రాంగణమంతా కిక్కిరిసింది. స్టేజీపై కార్యక్రమం మొదలైంది. అతిథులు ఒక్కొక్కరు స్టేజీపై కుర్చీలో కూర్చున్నారు. ఇంతలో ఎంపీ గోరంట్ల మాధవ్ కంట పోలీస్ సీఐ పడ్డాడు. వెంటనే మాధవ్ రేయ్…ఇటు రారా అంటూ బిగ్గరగా అరిచాడు. అంతే ఒక్కసారి సభలో నిశ్శబ్దం. ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. కోపంతో పిలిచాడా…బెదిరిస్తాడా…ఒక పోలీస్ అధికారిని రేయ్….రారా అంటూ పిలవడం ఏంటనీ అనుకున్నారు అందరూ. మాధవ్ పిలవగానే సీఐ మురళీధర్ రెడ్డి స్టేజీ పైకి వెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా చూస్తున్న జనానికి అర్థం కాలేదు.

అసలు విషయం ఏంటంటే…ఎంపీ గోరంట్ల మాధవ్, సీఐ మురళీధర్ రెడ్డి స్నేహితులు. ఇద్దరు ఒకేసారి 1998లో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. కాలం మారి గోరంట్ల మాధవ్ ఎంపీ అయ్యారు. సీఐ మురళీధర్ రెడ్డి తన స్నేహితునికి బందోబస్తుకు వచ్చాడు. దీంతో అక్కడ చూసిన మధావ్, మురళీధర్ ను పిలిచుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. తన స్నేహితుడు తనకు బందోబస్తు నిర్వహించడం ఏంటని అన్నాడు. ఆ తర్వాత సభలో మాధవ్ మాట్లాడుతూ ఇద్దరం కలిసి పనిచేశామని…మురళీధర్ నిజాయితీగా పనిచేస్తాడని..ఇంటలీజెంట్ అన్నారు. కాస్తలో ఉన్నత పదవులు మురళీ పోగొట్టుకున్నాడని అన్నారు. మంచి అధికారి మన ఏరియాకు విధుల్లో రావడం అద్రుష్టం అన్నారు. ఇలా స్నేహితున్ని పలిచి హత్తుకున్న ద్రుశ్యం చూసిన జనం ఆనందం వ్యక్తం చేశారు. ఎంత ఎదిగినా స్నేహాన్ని మరిచిపోలేదని మాధవ్ ను పొగిడ్తలతో ముంచెత్తారు.

LEAVE A REPLY