BUS Fire Accident : ట్రాఫిక్ చలాన్లలో వేమూరి కావేరి ట్రావెల్స్ బాగోతం బయటపడింది. ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలోనే 16 చలాన్లు ఉన్నాయి. బస్సు నెంబర్(DD01N9490)పై మొత్తం 23,120/- ఫైన్లు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 అక్టోబరు వరకు 16 చలాన్లు ఉండగా.. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించింది బస్సు. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు ఉన్నాయి.

ఇక ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు కూడా ముగిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో పూర్తి అయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయింది. కర్నూల్ శివారులో తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. బైక్‌ను 300 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. 20 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది ఈ ట్రావెల్స్ బస్సు.
