Devaragattu : దేవర గట్టు కర్రల సమరంలో విషాదం.. ఇద్దరు మృతి

Devaragattu :  కర్నూలు జిల్లాలో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే కర్రల సమరంలో ఈ ఏడాదీ హింస తప్పలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా వేలాది మంది ప్రజలు బన్ని ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించలేదు. ఉత్సవ విగ్రహాలను కాపాడుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు చనిపోయారు. సుమారు 100 మంది గాయపడగా…. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు.