APలో ఘోరం.. లోయలో పడ్డ బస్సు..స్పాట్ లో 37 మంది

crime

AP : అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లోయలో పడింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు బస్సు వెళ్తుండగా.. మారేడుమిల్లి తులసి పాకల వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. అల్లూరిలో బస్సు ప్రమాదంతో చింతూరు- మారేడుమిల్లి మధ్య వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదం జరిగిన బస్సు నెంబర్: AP 39 UM 6543

అల్లూరిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం తీవ్ర బాధాకరమని అన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. గాయపడినవారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు ఆయనకు తెలిపారు.