Vadapalli : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం నుంచి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన పూజలు, వాహన సేవల్లో ఆయన పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాత్రికి అశేష భక్త జన సందోహం నడుమ మేళతాళాలు, భజన కోలాట నృత్యాలతో స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కల్కి అవతారంలో అశ్వ వాహనంపై ఊరేగారు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం నుంచి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు.#Gantiharish #Amalapuram #konaseema #AndhraPradesh pic.twitter.com/1FYOo7HAMy
— kotlata (@kotlataweb) October 18, 2025
అలాగే స్వామి, అమ్మ వార్లను ఊరేగిస్తూ ఆలయ అర్చకులు, వేద పండితులు నృత్యాలు చేస్తూ చూర్ణం చల్లుకుంటూ మాడవీధుల్లో నిర్వహించిన చూర్ణోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమాల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనంత కుమారి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లి వెంకన్న ఆలయంలో చేసిన ఫల,పుష్ప అలంకరణలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. నేటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.