ELURU : బావతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధించారు.. రూమ్ లోనే బంధించి

ELURU

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బావ ప్రవీణ్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, అతనితో పిల్లల్ని కనాలని అమృతవల్లి అనే ఓ వివాహితను ఆమె అత్తమామలు నాగేశ్వరరావు, చంద్రలు వేధించారు. అత్తమామలే కాదు.. చివరకు కట్టుకున్న భర్త రంజింత్‌ కుమార్‌ కూడా ఆమెను వేధించాడు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని దారుణంగా వేధించారు. అందుకు ఆ వివాహిత నిరాకరించింది.

దీంతో గత 13రోజులుగా ఆమెను గదిలోనే బంధించారు. గదిలో కరెంట్, మంచినీళ్ళు సౌకర్యం కూడా లేవు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, మానవ హక్కుల సంఘాల నేతలు గది తాళాలు పగులగొట్టి అమృత వల్లిను బయటకు తీసుకువచ్చి ఆమెను రక్షించారు.

బాధితురాలు అమృతవల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తమామలు, బావ ప్రవీణ్, రంజింత్‌ కుమార్‌ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.