AP Assembly : ఐదు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly :  ఏపీ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. మున్సిపల్ చట్టంలో ఐదు సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ 5 బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని ఐదు సవరణ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టగా వాటికి శాసన సభ ఆమోదం లభించింది.

నాలా చట్టం రద్దుతో మున్సిపాల్టీలు అదనపు అభివృద్ది ఛార్జీలు వసూలు చేసి.. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సవరణ చేశారు. బహుళ అంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులు 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది.

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ గా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు, ఇకపై ఏప్రిల్ 1, జూలై1, అక్టోబ ర్ 1 గా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మార్చారు. వైసీఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరును తాడిగడప మున్సిపాల్టీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదించారు