YCP :ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ అస్సలు టైమ్ బాలేదు. అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని చవిచూసింది. అయితే ఈ రెండు స్థానాల్లో ఉపఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వైసీపీకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు
పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు వేసిన పిటిషన్ లను డిస్మిస్ చేసిన హైకోర్టు
దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు
ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం#TeamBTF #BangaloreTDPForum pic.twitter.com/Fm2IpEw3V4
— Bangalore TDP Forum (@BangaloreTDP) August 14, 2025
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వాటిని కొట్టివేసింది.పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలలో, ఒంటిమిట్టలోని 30పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా… హైకోర్టు తిరస్కరించింది. విషయంలో తాము కలగజేసుకోలేమని తెలిపింది. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే హైకోర్టు విచారించే సమయానికే పులివెందుల ఫలితాలు రావడం విశేషం. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు మాత్రమే లభించాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. ఒక ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి.