AP Inter Exams : ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ 

AP Inter Exams : ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయని ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ , ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్‌ సెంకడియర్ ఎగ్జామ్స్ జరుగుతాయని బోర్డు వెల్లడించింది. జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఒకేషనల్‌ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు సెషన్లలో ఉంటాయని వెల్లడించింది.

ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు (ఆదివారాల్లో సహా) రెండో సెషన్‌ ఉంటాయని తెలిపింది. అయితే ఈ షెడ్యూల్ తాత్కలికమేనని, ఒకవేళ పండగల ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.